Wednesday 25 June 2014

అక్కినేని,మేఘా కాంబినేషన్ లో చిత్రం


“మనం” సినిమాలో తళుక్కున మెరిసి మాయమైన అక్కినేని వారి వారసుడు అఖిల్ తానూ హీరో గా కనిపించబోయే మొదటి సినిమా కు రంగం సిధం చేసుకుంటున్నాడు.

అతని సరసన కనిపించబోయే హీరోయిన్ ఎవరా అన్న విషయం పై ఇదివరకు చాలానే పుకార్లు వినిపించాయి. అయితే అఖిల్ సరసన నటించనున్నది మరెవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారికే నని విస్వసనియ్య సమాచారం. ఇటు నాగార్జున కూడా నిహరికే బెటర్ అని అభిప్రాయపడితే. అటు మెగా ఫ్యామిలీ కూడా నిహరిక తెరంగేట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

ఇంతకు ముందు అఖిల్ సరసన నటించబోయే హీరోయిన్ల జాబితాలో నిహారిక పేరు వినిపించినా రెండు కుటుంబాలు ఈ విషయం మీద నోరేతకపోవటం తో ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇటీవలే వీరి పై జరిగిన ఫోటో షూట్ తో అసలు విషయం బయటకు వచ్చింది. నిజానికి వీరిద్దరు ఇంతకుముందే ఒక షార్ట్ ఫిల్మ్ లో కలిసి నటించారట. అది చూసిన నాగార్జున జంట చాలా బావుందని ఫీలయ్యరట. కధ,దర్శకుడు వంటి మరికొన్ని విషయాలు కరారైన వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తారని అన్నపూర్ణ స్టూడియో వర్గాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment